Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?  
                                       
                  
				  				   
				   
                  				  అక్కినేని నాగచైతన్యను గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న శోభిత ధూళిపాళ సినిమాలకు దూరంగా వుంది. ఇటీవలే విదేశాల్లో పర్యటిస్తూ గర్భం దాల్చినట్లుగా ఫొటోలతో సోషల్ మీడియాలో వైలర్ అయింది. కానీ తర్వాత వారు రూడీ చేయలేదు. తాజా సమాచారం మేరకు శోభిత ధూళిపాళ తమిళ సినిమాలో ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
	 
	అయితే అంతకుముందుగా సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేస్తున్న ఈ సిరీస్ ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నారట. కాగా, రంజిత్ రూపొందిస్తున్న సినిమా సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.  దీనికి వెట్టువం అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. ఇందులో దినేష్ హీరోగా నటిస్తుండగా, జోడీ శోభిత ధూళిపాళ నటిస్తోందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
				  
	 
	వివాహం అయ్యాక తెలుగులోనే నటించాలని ప్లాన్ చేసింది ఆమెకు కొద్దిరోజులు గేప్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకే సురేష్ ప్రొడక్షన్ ముందుకు వచ్చి వెబ్ సిరీస్ చేస్తుంది. అది ఆదరణ పొందితే తెలుగులో భారీ సినిమాలో నటించే ఛాన్స్ వుంటుందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.