శనివారం, 1 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (14:00 IST)

Chiru: సర్దార్ పటేల్ ని స్పూర్తిగా తీసుకోవాలి - వాటిపై అసెంబ్లీలో చట్టాలు చేయాలి : చిరంజీవి

Chiranjeevi, DGP B. Shivdhar Reddy, Police Commissioner V.C. Sajjanar
Chiranjeevi, DGP B. Shivdhar Reddy, Police Commissioner V.C. Sajjanar
నేడు రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా హైదరాబాద్ లో సినీ కథానాయకుడు, రాజకీయ వేత్త మెగాస్టార్ చిరంజీవి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి హాజరయ్యారు. డిజిపి బి. శివధర్ రెడ్డి, పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్‌లతో కలిసి ఆయన రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ పోరాట పటిమను, ఐక్యత కోసం ఆయన చేసిన చాణుక్యతను ప్రశంసించారు. అందరూ కలిసి ఐక్యమత్యంగా వుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన్నుంచి యువత నేర్చుకోవాలని సూచించారు.
 
అంతేకాకుండా.. సర్దార్ పటేల్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేవారు. ఇది ఆయన ఇచ్చిన అందమైన కోట్, మరియు మేము కలిసి వెళ్తున్నాము. ప్రతి యువత సర్దార్ పటేల్ గొప్ప సూక్తి నుండి స్ఫూర్తిని తీసుకోవాలి. అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం" అనే భావనను సుసాధ్యం చేసి, స్వాతంత్ర్యం అనంతరం రాజకీయ సరిహద్దులను చెరిపి,సమైక్య భారతదేశాన్ని ఆవిష్కరించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్  గారి జయంతి సందర్భంగా…ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ.. అందరికీ జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు

అసెంబ్లీలో చట్టాలు
ఈ సందర్బంగా టెక్నాలజీ పేరుతో తప్పుడు పోస్ట్ లు, ఫేక్ వీడియోలు పెడుతున్న వారిపై కూడా మండిపడ్డారు. నాకు కలిగిన చేదు అనుభవం చాలామంది ప్రముఖులకు కలిగింది. ఈరోజు రన్ లో సజ్జనార్ కూడా మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న వాటి గురించి ఎ.ఐ. టెక్నాలజీ దుర్వినయోగం గురించి మాట్లాడారు. చెడును కట్టడి చేయడానికి చట్టాలు రావాలి. డీప్‌ఫేక్‌పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. 
 
అలా జరిగితేనే సామాన్యులకు కూడా ఇలాంటి అవాంతరాలనుంచి రక్షణ లభిస్తుంది. మంచి జరుగుతున్నప్పుడు చెడు కూడా పుట్టుకొస్తుంది. పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా బెస్ట్ ఇస్తూ సమస్యను సాల్వ్ చేస్తారు. ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. అసెంబ్లీలో చట్టాలు తీసుకువస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అని చెప్పారు.