శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (13:06 IST)

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh, Ajay Devgn
Rakul Preet Singh, Ajay Devgn
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సాంప్రదాయమైన కేరెక్టలు చేసింది. కానీ ఇతర బాషల్లో పలు భిన్నమైన పాత్రలను పోషిస్తోంది. బాలీవుడ్ లో పరిమితులుండవు. కనుక అజయ్ దేవ్ గన్ తో దేవే ప్యార్ దే2 సినిమా చేసింది. వచ్చే నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఇందులో అజయ్, రకుల్ పాల్గొన్న పబ్ సాంగ్ కు మరి స్పందన వచ్చింది. జుమ్ జుమ్ షరాబీ... అనే గీతం మందు పార్టీ నేపథ్యంలో సాగుతుంది. పబ్ నేపథ్యంగా సాగిన ఈ పాటలో రకుల్ కుర్రకారుని ఆకట్టుకునేట్లుగా వుంది.
 
కధానాయికగా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఐటం గాళ్ కు ధీటుకాకుండా డాన్స్ చేసింది. సినిమా పబ్లిసిటీలో భాగంగా ఈ పాటను విడుదల చేయగా వైరల్ అయింది. అజయ్ దేవ్ గన్ మిత్రులతో మందుకొడుతూ నుదిటిపైన గ్లాస్ పెట్టుకుని సాగే ఈ పాటలో రకుల్ కవ్వింపుగా వుంటుంది. ఆమె తన అందాలను కూడా ప్రదర్శిస్తుంది. రకుల్ చేసింది సింపుల్ స్టెప్ అయినా ఎరోటిక్ మూవ్ మెంట్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. గతంలో వచ్చిన జూమ్ షరాబీకి రీమిక్స్ సాంగ్ ఇది. 
 
మామూలుగా గ్లామర్ డాల్ గా వుండే రకుల్ శారీలో హాట్ నెస్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆమె హాట్ నెస్ గురించి టాపిక్ గా మారింది. ఆమె వేసిన స్టెప్ ల షాట్ తీసి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇది ఓ రకంగా సినిమాకు ప్లస్ అవుతుందనిపిస్తుంది. చిత్రం ఏమంటే చిల్డ్రన్ రోజున ఐటెం సాంగ్ తో వస్తున్న దే దేవే ప్యార్ 2 సినిమా విడుదల కావడం విశేషం.