అబ్బే.. తెలివి తక్కువ రాతలకు స్పందించాల్సిన అవసరం లేదు..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో చైతూ విడాకులకు శోభిత ధూళిపాళ్లనే కారణమంటూ వచ్చిన వార్తలపై తొలిసారిగా శోభిత ధూళిపాళ్ల తొలిసారిగా స్పందించింది. తెలివి తక్కువ రాతలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని, ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తేల్చి చెప్పేసింది.
తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వాటికి స్పందించాల్సిన అవసరం కూడా తనకు లేదని తేల్చేసింది. ఇలాంటి రాతలు రాయడం కంటే జీవితం దృష్టి పెట్టాలని.. దానిని మెరుగుపరుచుకునేందుకు కామ్‌గా వుండాలని వెల్లడించింది. మంచి వ్యక్తిలా వుండేందుకు ప్రయత్నించాలని హితవు పలికింది.
విబేధాల కారణంగా చైతూ సమంత 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని నెలలకు శోభిత, చైతన్యకు సంబంధించిన రూమర్లు తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లలో నిజం లేదని శోభిత స్పష్టం చేసింది.