నిశ్చితార్థం.. మధ్యలో డిన్నర్ వెళ్లిన పరిణితి చోప్రా-రాఘవ్ జంట (video)
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బిటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ జంట డిన్నర్‌కు వెళ్లింది. రెస్టారెంట్‌లో ఈ ఇద్దరినీ చూసిన అక్కడున్న వారు పెళ్లి గురించి అడుగుతూ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, ఎలాంటి వివరాలు వెల్లడించని జంట వారికి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఈ నెల 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అయితే తమపెళ్లి గురించి పరిణీతి, రాఘవ ఇప్పటిదాకా పెదవి విప్పడం లేదు. అక్టోబర్ చివర్లో వీరి పెళ్లి జరుగుతుందని టాక్ వస్తోంది.