బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (21:59 IST)

ఏప్రిల్ మొదటి వారంలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా నిశ్చితార్థం? (video)

Parineethi Chopra
Parineethi Chopra
ఏప్రిల్ మొదటి వారంలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో వీరి నిశ్చితార్థ వేడుక సింపుల్‌గా జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చందా, నటి పరిణీతి చోప్రాలు ప్రేమలో వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో జరిగే సన్నిహిత నిశ్చితార్థ వేడుక ద్వారా వీరి వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. గత నెలలో రాఘవ్ మరియు పరిణీతిల మధ్య డేటింగ్ పుకార్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి లండన్‌లో తరువాత ముంబైలో జంటగా కనిపించారు. ముంబై, న్యూఢిల్లీ విమానాశ్రయాలలో ఇద్దరూ తరచుగా కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.