బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (12:53 IST)

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

omar abdullah
omar abdullah
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీకి ఆరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందే వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఒకేరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వేర్వేరుగా భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు, ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దీనిపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
రాష్ట్ర హోదాపై కీలక ప్రకటన వస్తుందని చాలా మంది భావిస్తుండగా, ఈ వార్తలను ఆయన ఖండించారు. జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్టచ్ర హోదా ఇస్తారంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ, ఇది నిజమని తాను నమ్మడం లేదన్నారు. ఆగస్టు 5వ తేదీన ఏమీ జరగదని తాను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.