ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (17:37 IST)

లిచి ఫ్రూట్ బెనిఫిట్స్ అద్భుతం, ఏంటవి?

లిచి ఫ్రూట్. ఈ లిచి పండు తింటుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ లిచి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన హైబీపీని అదుపులో ఉంచుతుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము.
 
లిచి పండ్లను తీసుకోవడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లిచి పండ్లలో విటమిన్ సి అధికంగా వుండటంతో తెల్ల రక్తకాణాల పనితీరును మెరుగుపడుతుంది. లిచి పండు తింటుంటే రక్తసరఫరా మెరుగై గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. లిచిలో ఉండే కాపర్, ఐరన్‌లు శరీరంలోని ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతాయి.
 
లిచిలో వుండే విటమిన్ సి చర్మంపై ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం యవ్వనంగా, ముడతలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో మెగ్నిషియం, కాపర్, పాస్పరస్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఎముకల బలానికి దృఢత్వాన్నిస్తాయి.
 
ఈ లిచి పండ్లలో ఫైబర్ కొవ్వును కరిగించే శక్తి ఉంది కానీ ఈ పండ్లతో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. గమనిక: ఈ సమచారం అవగాహన కోసం ఇవ్వబడింది. లిచిని తీసుకునే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.