గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 మే 2023 (19:07 IST)

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు సింపుల్ టిప్స్

Belly Fat
ఇటీవలి కాలంలో కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. దీనితో పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్తలు పడుతుంటారు కొందరు. ఐతే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే నడుము చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. క్యాప్సికమ్, చిల్లీ పెప్పర్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి, దీని వలన శరీర బరువు తగ్గుతుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి, ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది.
 
జీలకర్రను వివిధ ఆహారాలు, వంటకాలు, సలాడ్ల రూపంలో తీసుకుంటుంటే పొట్ట వద్ద చేరిన కొవ్వు తగ్గుతుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, బరువును అదుపులో వుంచడానికి ప్రతి ఉదయం కప్పు గ్రీన్ టీని త్రాగాలి. బెల్లీ ఫ్యాట్, బరువును అదుపులో వుంచడానికి రోజూ 30 నిమిషాల వ్యాయామం చేస్తుండాలి.