శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 జూన్ 2023 (18:22 IST)

దంపుడు బియ్యం ప్రయోజనాలు

brown rice
తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యంలో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారానికి ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెపుతున్నారు.
 
దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 దంపుడు బియ్యంలో ఎక్కువ. దంపుడు బియ్యం తినేవారిలో గుండె సమస్యలు రావనీ, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ఇవి అడ్డుకుంటాయని చెపుతున్నారు.
 
దంపుడు బియ్యంలోని పిండిపదార్థం నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు. బ్రౌన్ రైస్ లో పీచు పదార్థం ఎక్కువగా వుండటంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో వుంటుంది.