మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను తినకూడదా?
మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకూడదని చెప్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులు పచ్చి అరటిపండ్లను తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణాశయంలోని అల్సర్‌లను నయం చేస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను విరివిగా తినవచ్చు, ఎందుకంటే వాటిలో పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు పచ్చి అరటిపండు బాగా మేలు చేస్తుంది.
అరటి పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణ క్రియ సాఫీగా చేస్తాయి. అలానే బోలు ఎముకల వ్యాధితో బాధపడే వారు అరటి పండ్లు తీసుకోవడం వల్ల బలహీనత దూరమై కొత్త శక్తి కలుగుతుంది.
పైల్స్ సమస్య ఉన్న వారికి పచ్చి అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.