కాకర కాయ చేదు తగ్గించేందుకు చిట్కాలు
కాకర కాయ. ఈ కాయ అంటేనే చేదు. ఐతే కాకర కాయలను తినాలని చాలామంది అనుకుంటారు కానీ, అది చేదుగా వుంటుందని వాటి జోలికి వెళ్లరు. కాకరలో కాస్త చేదు తగ్గించి తినేందుకు ఈ చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాము. కాకర కాయలను ముక్కలుగా కట్ చేసాక అందులోని విత్తనాలను మొత్తం తీసేసి కూర చేస్తే చేదు తగ్గుతుంది.
కాకర కాయ ముక్కలుగా తరిగాక వాటిని ఉప్పు, పసుపు వేసి పిసికి కడిగితే చేదు తగ్గుతుంది. ఉప్పు నీటిలో వేసి కాకర ముక్కలను ఉడికించినా కూడా చేదు తగ్గుతుంది. కాకర కాయ ముక్కలకు కాస్తంత వెనిగర్ కలిపి, ఆ తర్వాత కొద్దిగా చక్కెర కలిపి కడిగేసి ఉడికిస్తే చేదు తగ్గుతుంది. కాకర ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసినా కూడా వాటిలో వున్న చేదు కాస్తంత తగ్గిపోతుంది.
కాకరకాయలకు పైన వున్న తోలును పూర్తిగా పీల్ చేసి వాడుకున్నా చేదు తగ్గుతుంది.
కాకర కూర వండేటపుడు చిన్న బెల్లముక్కను వేస్తే చేదు శాతం తగ్గుతుంది.