మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2023 (23:02 IST)

వెలగ పండును స్త్రీలు, పురుషులు ఎందుకు తినాలో తెలుసా?

wood-apple
వెలగ పండు. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. ఈ వెలగపండుతో శరీరానికి చేకూరే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అల్సర్‌తో బాధపడే వారు వెలగ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. ఈ పండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికి మంచిది.
 
ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసట, నీరసం ఆవహించినప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లు ఈ పండ్లు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి.
 
స్త్రీలు ఈ పండు గుజ్జును తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది.