ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (22:14 IST)

పీచ్ పండుతో ఆరోగ్యం.. అందం మీ సొంతం..

Peach fruit
Peach fruit
ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే చర్మానికి మరింత మెరుపును ఇస్తాయని అనుకోవడం పూర్తిగా తప్పు. సహజసిద్ధంగా, తక్కువ ఖర్చుతో సులభంగా లభించే మూలికలు, కూరగాయలు, పండ్లు కూడా ముఖ సౌందర్యం, చర్మం మెరుపులో సహాయపడతాయి. 
 
ఆ విధంగా ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో, చర్మం కాంతివంతంగా మారడంలో పీచ్ పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఈ పండు ముక్కను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం పొడిబారడం, దురదను నివారిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
 
పీచెస్ నుండి విత్తనాన్ని తీసివేసి, గుడ్డులోని తెల్లసొనతో కలపండి. తరువాత, ముఖం, మెడపై అప్లై చేసి, 30 నిమిషాలు అలాగే వుంచాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం, మెడ భాగంలోని నలుపు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా ఉంటుంది. 
 
పీచెస్, టొమాటోలను బాగా గ్రైండ్ చేసి ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు నానబెట్టి కడిగేస్తే ముఖంపై ముడతలు క్రమంగా మాయమవుతాయి. పండిన పీచ్ ఫ్రూట్‌ను గ్రైండ్ చేసి అందులో కొంచెం తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 
 
ముఖం బాగా టోన్ అవుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. కావాలనుకుంటే, దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.
 
పీచు పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండుతో ఫేషియల్ చేయడం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది. కోడిగుడ్డులోని తెల్లసొనను పీచెస్‌తో కలిపి తలకు పట్టించి కాసేపు ఉంచి తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే పీచు జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుతుంది.