ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (12:04 IST)

నిధి అగర్వాల్‌కు బంపర్ ఆఫర్.. ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందా?

Nidhi Agarwal
కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ విడుదల తర్వాత నిధి అగర్వాల్‌కి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.
 
తాజాగా ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసిందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశాన్నిఆమె సొంతం చేసుకుందని టాక్. ఇది హారర్ కామెడీ చిత్రంగా చెప్పబడుతుంది.
 
ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్‌ని దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 
 
ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. నిజంగా నిధి అగర్వాల్‌కి ఈ సినిమా ఆఫర్ వస్తే ఆమె పంట పండినట్లే. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్‌లో నిధి స్టార్ స్టేటస్‌తో వెలిగిపోయే అవకాశం ఉంది.