శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (23:25 IST)

అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీరోజ్? (video)

honeyrose
అందాల తార హనీ రోజ్ మలయాళ సినిమా నుంచి దక్షిణాది సినీ రంగాల్లో గ్లామర్ క్వీన్‌గా వెలుగొందుతోంది.  బాయ్‌ఫ్రెండ్ అనే సినిమాతో తన 14వ ఏటనే ఈ ముద్దుగుమ్మ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో పలు చిత్రాల్లో నటించారు. 
 
ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణతో కలిసి వీరసింహారెడ్డి చిత్రంలో నటించి ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో హనీరోస్‌ సర్జరీ చేయించుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకుందని దక్షిణాది సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగింది. 
 
ఈ వార్తలపై స్పందించిన నటి హనీ రోజ్... "నా అందం కోసం కొన్ని పౌడర్లు మాత్రమే వాడతాను. ఎలాంటి సర్జరీ చేయలేదని స్పష్టం చేసింది. సినిమా రంగంలో గ్లామర్‌గా నిలవడం అంత తేలికైన విషయం కాదు.. మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దేది దేవుడే... అందుకే ఈ అందం దేవుడిచ్చింది" అని ఆమె చెప్పింది. ప్రస్తుతం హనీరోజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.