1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జులై 2023 (22:37 IST)

రామ్‌చరణ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వనున్న లయ (video)

Laya
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి లయ. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడింది లయ. అయితే తాజాగా మళ్లీ సినిమాలపై ఆసక్తి చూపింది. ఆ మధ్య ఓ టీవీ షోలో పాల్గొంది. త్వరలో ఆమె వెండితెరపైకి పునరాగమనం చేయనుంది. ఆమె పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 
 
రామ్ చరణ్ సినిమాలో లయ నటించబోతోందని సమాచారం. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఇది వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి రానుంది. 
 
రామ్ చరణ్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనతో జతకట్టనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటించే సినిమాలో కీలక పాత్ర కోసం లయను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
నటి ఆమోదం తెలిపితే, ఆమె రీ-ఎంట్రీ ఖాయం. ఏం జరుగుతుందో చూద్దాం. లయ కూడా మళ్లీ సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.