శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (09:52 IST)

ధ్యానం చేయడం సులభం.. ఫలితం అమోఘం : సమంత

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సమంత.. ఆధ్యాత్మికత వైపు కూడా దృష్టి సారించింది.
 
తాజాగా బుధవారం కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అందరితో కలిసి ధ్యానం చేశారు. 
 
అనంతరం, ధ్యానంలో తనకెదురైన అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధ్యానం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పింది. ధ్యానం సింపుల్.. కానీ పవర్‌ఫుల్ అంటూ సమంత తెలిపింది. 
 
శరీరంలో కదలికలు లేని నిశ్చలమైన స్థితి అసాధ్యమని తనకు ఇప్పటివరకూ అనిపించింది. కానీ ఈ రోజు ధ్యానస్థితి తనకు శక్తి, ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతను ఇచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సమంత పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.