1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (11:25 IST)

కత్రినా కైఫ్ సోదరుడు కాదు.. ఇలియానా తాజా ప్రేమికుడు ఎవరబ్బా?

Ileana D'Cruz
Ileana D'Cruz
గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ గర్భవతి కావడంతో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. బర్ఫీ అమ్మాయి పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుందనేది ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఆమె గత కొంత కాలంగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో వున్నట్లు వార్తలు వచ్చాయి.
 
అయితే ఇందులో నిజం లేదని ప్రస్తుతం తేలిపోయింది. ప్రస్తుతం ఇలియానా తన మిస్టరీ మ్యాన్ ఫోటోలను బయటపెట్టింది. కానీ అతని గుర్తింపును వెల్లడించలేదు. ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలియానా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
 
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండింటికీ దూరంగా ఉన్న ఇలియానా ప్రస్తుతం మ్యూజిక్ వీడియోలలో నటిస్తోంది. ఇకపోతే.. ఇలియానా తాజా ప్రేమికుడు ఎవరనే వివరాల కోసం అభిమానులు వెతికే పనిలో పడ్డారు.