మహేష్ తనయ సితార.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో మెరిసింది..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార గొప్ప ఘనత సాధించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్‌గా వున్న సితార... తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తోంది. ఇంకా ప్రకటనల్లో కనిపించింది.
ఈ నేపథ్యంలో కేవలం 11 ఏళ్ల వయసున్న సితార, న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై కనిపించి తన తల్లిదండ్రులను అమితంగా సంతోష పెట్టింది. జ్యుయెల్లరీ షాపుకు ఆమె అంబాసిడర్‌గా మారింది. దీంతో పాటు టైమ్స్ స్క్వీర్ బిల్ బోర్డ్ ప్రకటనలో కనిపించింది.
ఫలితంగా ఇంత చిన్న వయస్సులో టైమ్స్ స్క్వేర్‌ను అలంకరించిన ఏకైక సెలబ్రిటీ చైల్డ్‌గా నిలిచింది. దీనిపై స్టార్ హీరో మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.