గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (09:47 IST)

ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌: చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే..?

ashwin
భారత్‌లో ప్రపంచ కప్ -50 ఓవర్ల సిరీస్‌‌కు భారత్ ఆతిథ్య మిస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల ఐసీసీకి పంపింది. ఐసీసీ ఆయా జాతీయ క్రికెట్ బోర్డులకు పంపింది. ఈ సందర్భంలో, కొన్ని మ్యాచ్‌ల కోసం ఈ ముసాయిదా షెడ్యూల్‌పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 
 
ఆప్ఘనిస్థాన్‌తో చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వేరే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ జట్టును కోరినట్లు సమాచారం. 
 
దీనిపై మాట్లాడిన భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. "చెన్నైలో మ్యాచ్ నిర్వహిస్తే ఆప్ఘనిస్థాన్‌కు అనుకూలమని పాకిస్థాన్ జట్టు భావిస్తోంది. అయితే భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఐసీసీ అలాంటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోదు. చెన్నైకి బదులు మరెక్కడైనా జరిగితే అది పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంటుంది" అని చెప్పారు.