శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (08:41 IST)

అంతరిక్షంలో వికసించిన లేత నారింజ రేకులతో పువ్వు

NASA
NASA
నాసా తన తాజా ఆవిష్కరణతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జూన్ 13న, వెజ్జీ సదుపాయంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వికసించిన జిన్నియా పుష్పం ఫోటోను పంచుకోవడానికి నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లేత నారింజ రేకులతో పువ్వు వికసించింది. అంతరిక్షంలో మొక్కల పెంపకం సామర్థ్యాన్ని అన్వేషించేందుకు నాసా తెలిపింది. 
 
వ్యోమగాములు అంతరిక్షంలో తాజా ఆహారాన్ని పెంచడానికి వీలుగా రూపొందించబడిన కూరగాయల సౌకర్యం, భూమి పరిమితికి మించి ప్రయోగాలు చేయడం, మొక్కల పెంపకాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించింది.