ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (10:32 IST)

ట్రక్కులో జర్నీ వీడియో.. 150 సీట్లు కచ్చితంగా గెలుస్తాం.. ఎవరు?

Rahul Gandhi
Rahul Gandhi
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవలే హర్యానాలోని ముర్తల్ నుంచి అంబాలా వరకు ట్రక్కులో ప్రయాణించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో, అతను ట్రక్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆందోళనలు, సవాళ్లను ప్రస్తావిస్తూ చూడవచ్చు.
 
ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు తన ఆరు గంటల ప్రయాణంలో ట్రక్ డ్రైవర్లతో జర్నీ అని క్యాప్షన్ చేస్తూ, వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
 
మరోవైపు ఇటీవలే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్... ఇతర రాష్ట్రాల్లోనూ అదే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమాతో ఉంది. 
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ, 150 సీట్లు కచ్చితంగా గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.
 
రాహుల్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేతలు పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.