సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (20:39 IST)

ట్రక్కులో రాత్రి జర్నీ చేసిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ ట్రక్కులో ప్రయాణించారు. హెవీ వెహికల్ డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం రాత్రి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరారు. ఇందులో భాగంగా అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 
 
ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హైవేపైన వెళుతున్న మిగతా వాహనాలలోని ప్రయాణికులు షాకయ్యారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. 
 
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయాణం పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.