గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 జూన్ 2023 (13:34 IST)

'సారంగదరియా' పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ వేసిన మహేష్ గారాలపట్టి

sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల గారాలపట్టి సితార సారంగదరియా పాటకు డ్యాన్స్ చేశారు. చక్కటి అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అదిరిపోయేలా డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరినీ ఆలరించారు. లంగా ఓణీలో సాయిపల్లవిని గుర్తు చేసిన సితార... సారంగదరియా పాటకు చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటికే 4.40 లక్షల మంది నెటిజన్లు లైక్ చేశారు. 
 
సోషల్ మీడియాలో సితారకు ప్రత్యేక ఫ్యాన్స్‌తో పాటు గుర్తింపు కూడా ఉంది. సితార షేర్ చేసే డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా "లవ్ స్టోరీ" సినిమాలోని సారంగదరియా పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 
 
చక్కటి అభినయంతో క్యూట్ స్టెప్పులతో ఆలరించిన సితార.. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తుచేసింది. ఈ సారంగదరియా సాంగ్‌ను సితారకు అనీ మాస్టర్ నేర్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.