ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (13:22 IST)

తమన్నా పట్ల అభిమాని ఓవరాక్షన్.. నా తొలి ముద్దు ఆయనకే..?

tamannah
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అగ్రనటిగా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమెకు మెరుగైన అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. తమన్నా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో నటిస్తోంది. నటుడు విజయ్ వర్మ హీరోగా నటించారు.
 
ఇందులో తమన్నా బాగానే అందాలను ఆరబోసింది. ఇక తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. "ఇన్నాళ్ల నా కెరీర్‌లో లిప్‌లాక్‌ సీన్స్‌కి నో చెబుతూ వచ్చాను. కానీ మొదటిసారి ఈ సినిమాలో లిప్‌లాక్‌ సీన్ చేశాను. ఆన్ స్క్రీన్‌లో నేను లిప్‌లాక్‌ ఇచ్చిన మొదటి వ్యక్తి విజయ్‌నే” అంటూ చెప్పుకొచ్చింది. 
 
ఇక ఈ మాటలకు విజయ్ రియాక్ట్ అవుతూ.. “నాతో మొదటి ముద్దు అని చెప్పినందుకు థాంక్యూ” అంటూ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. కేరళలో ఒక కార్యక్రమానికి హాజరైన తమన్నా పట్ల ఓ అభిమాని అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురై.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.