1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (16:04 IST)

ప్రధాని మోడీ ఓపెన్ టైప్.. భారత్‌లో త్వరలోనే టెస్లా సేవలు : ఎలాన్ మస్క్

elon musk - modi
భారత్‌లో వీలైనంత త్వరగా టెస్లా సేవలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఆయన బుధవారం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెస్లా సేవల ప్రారంభంపై మస్క్ ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత మస్క్ మాట్లాడుతూ, మోడీతో భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. అదేసమయంలో భారత్‌లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
తాను వచ్చే యేడాది భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలోనే భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోడీ నుంచి మంచి సహకారం లభిస్తుందన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అయితే, ఒక్క ప్రకటనలో తాము దీన్ని తేల్చిపారేయాలనుకోవడం లేదన్నారు. భారత్‌తో సంబంధాల విషయంలో తమ నిర్ణయం కీలంగా మారనుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. 
 
పైగా, భారత్‌లో పెట్టుబడులు ఆకర్షించే విషయంలో ప్రధాని మోడీ నిజమైన శ్రద్ధ చూపుతున్నారని కితాబిచ్చారు. తాను మోడీనికి అభిమానిని. ఆయనంటే తనకు చాలా ఇష్టం. ఆయన చాలా పారదర్శకంగా ఉండాలనుకుంటున్నారు. కొత్త కంపెనీలకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారు అని చెప్పారు. స్టార్‌లిక్ ఇంటర్నెట్ భారత్‌లోని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. సౌరశక్తి పెట్టుబడులకు భారతదేశం గొప్పదని అనుకుంటున్నట్టు చెప్పారు.