బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (17:14 IST)

జబర్దస్త్ స్టార్ కెవ్వు కార్తీక్ వివాహం ఫోటోలు, వీడియో వైరల్

Kevvu Karthik
Kevvu Karthik
జూన్ 9వ తేదీ అత్యంత సన్నిహితులు సెలబ్రిటీల సమక్షంలో జబర్దస్త్ స్టార్ కెవ్వు కార్తీక్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. తాజాగా కెవ్వు కార్తిక్ తన వెడ్డింగ్ వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
 
ఈ వీడియోలో వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలను ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ వివాహ వేడుకను జరుపుకున్నట్టు తెలుస్తుంది. 
 
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్, ఫ్యాన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
 
కార్తీక్ వివాహం తెలంగాణ, మొయినా బాద్ లో ఉన్న రాయల్ లీషా కన్వెన్షన్స్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వీడియో చివర్లో కార్తీక్ తన భార్యతో కలిసి అందరి బ్లెస్సింగ్స్ కోరుకోవడం జరిగింది.