1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Act of revenge : Three arrested for poisoning tigress, 4 cubs in Karnataka

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

tiger
తమిళనాడు - కేరళ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్నాటక చామరాజనగర జిల్లా హోసూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు అనునాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకకు చెందిన మదురాజు అనే వ్యక్తి తన ఆవును పులివేటాడి చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.
 
తాము ఎంతో అపురూపంగా  పెంచుకుంటున్న కెంచి అనే ఆవును ఇటీవల అడవిలో ఓ పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురైన మాదురాజు ఎలాగైన అడవిలోని క్రూరమృగాలను చంపాలని పథకం వేశాడని అధికారులు తెలిపారు. అతడి స్నేహితులు కోనప్ప, నాగరాజుల సహాయంతో చనిపోయిన తన ఆవు కళేబరంపై విష చల్లి, దానిని అడవికి సమీపంలో పడేసినట్టు తెలిపారు. 
 
ఈ విష కళేబరాన్ని తిన్న ఓ తల్లి పులి, నాలుగు కూనలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. దీంతో మాదురాజుని అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం మీణ్యం ప్రాంతంలోని అరణ్య భవన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధారమయ్యా ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
తర్వాతి కథనం
న్యూయార్క్‌లో జూలై 9న తమ నూతన ఫోల్డబుల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్