ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (20:12 IST)

పడవ నడిపే వృద్ధుడు.. ప్రీ-వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్ అయ్యాడు..

వివాహానికి ముందు ఫోటో షూట్‌లు నది, సముద్రం, కొండల పైన లేదా సుందరమైన ఉద్యానవనాలలో  అనేక అందమైన ప్రదేశాలలో జరుగుతాయి. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వినోదభరితంగా వుంది. 
 
ఈ వీడియో ఓ పడవ నడిపే వృద్ధుడు ఫోటోగ్రాఫర్‌గా మారాడు. ప్రీ -వెడ్డింగ్ ఫోటోలకు వధూవరులు ఒకరినొకరు ఎలా ఫోజులివ్వాలి అనే దానిపై దంపతులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించాడు. తన దట్టమైన ఉత్తరాంధ్ర యాసతో జంటను ఇలా నిలబెట్టండి, ఇలా చేతులు పట్టుకోండి, అమ్మాయిని ఎలా పట్టుకోవాలో చెబుతాడు. ఆ జంట నవ్వును ఆపుకోలేకపోయారు. 
Man
Man
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా నెటిజన్లు ఫన్నీ కామెంట్‌లను పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఆ వృద్ధుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. కొందరు అతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తున్నాడని కితాబిస్తున్నారు.