సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్

kevvu karthik
జబర్దస్త్‌ కమెడియన్‌, కెవ్వు కార్తిక్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తిక్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన తనకు కాబోయే సతీమణిని పరిచయం చేశారు. 'పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే అప్పట్లో నేను నమ్మలేదు. కానీ, ఇప్పుడు అది నిజమేననిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలు, భిన్నాభిప్రాయాలు, విభిన్నమైన ప్రపంచాలు.. ఒక్కటిగా కలిసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఫైనల్‌గా నా జీవిత భాగస్వామి సిరిని పరిచయం చేసే సమయం ఆసన్నమైంది' అంటూ ఆమెతో దిగిన పలు ఫొటోలను ఆయన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.
 
కాగా, 'జబర్దస్త్‌'తో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్‌.. పలు సినిమాల్లోనూ నటించారు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు.