సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్ చెన్నైలో తన మూడో షోరూమ్‌ను ప్రారంభించింది. వరమహాలక్ష్మి పేరుతో నెలకొల్పిన ఈ షోరూమ్‌ను సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్‌లు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. గత 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరంలో లాభాల పరంగా దక్షిణ భారతదేశంలో సంప్రదాయ దుస్తులు, ప్రత్యేకించి చీరల రిటైలర్‌లలో ఒకటిగా ఈ సంస్థ అగ్రగామిగా కొనసాగుతోంది.
అయితే, ఈ షోరూమ్ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చెన్నైలో వారి ల్యాండ్‌మార్క్ 50వ స్టోర్‌ను ప్రారంభించింది. 'వరమహాలక్ష్మి సిల్క్స్' బ్రాండ్ పేరుతో నెలకొల్పిన ఈ షోరూమ్... 4000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో, స్థానిక అన్నా నగరులోని మూడో ప్రధాన రహదారిలో దీన్ని నెలకొల్పారు.
కొత్త వరమహాలక్ష్మి స్టోర్ తమిళనాడులో మూడోది కావడం గమనార్హం. ఇప్పటివరకు స్థానిక మైలాపూర్, కాంచైపురంలోని గాంధీ రోడ్డులో మిగిలిన రెండు శాఖలు ఉన్నాయి. ఇక్కడ బనారసి, పటోలా, కోట, కాంచీపురం, పైథాని, ఆర్గాంజ, కుప్పడం మొదలైన పలు రకాల చీరలతో సహా ప్రీమియం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
కాంచీపురం పట్టు చీరలు వంటి చేనేత వస్త్రాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎస్ఎస్కేఎల్ స్టోర్‌లు వివిధ రకాలైన అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, విలువైన ఫ్యాషన్ ఉత్పత్తులతో సహా జాతి దుస్తులను కలిగి ఉన్న విభిన్న రకాల ఉత్పత్తులను అందించడం ద్వారా భారతదేశం యొక్క శక్తివంతమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి సారించాయి. ఈ వరమహాలక్ష్మి షోరూమ్‌లో రూ.4 వేల నుంచి రూ.2.50 లక్షల రేంజ్‌లో చీరలు అందుబాటులో ఉన్నాయి.
ఇదే అంశంపై సాయి సిల్క్స్ (కళామందిర్) మేనేజింగ్ డైరెక్టర్ నాగకనక దుర్గా ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ, 'తమిళనాడు మాకు ఎప్పుడూ ముఖ్యమైన మార్కెట్. భారతదేశంలో మా మూడో స్టోర్ సాయి సిల్క్స్ భారతదేశం అంతటా 50 స్టోర్‌లతో ఒక ప్రధాన మైలురాయిని దాటడం ఎంతో ఆనందంగా ఉంది. వరమహాలక్ష్మి ఫార్మాట్ స్టోర్ మా మొత్తం ప్రీమియం సిల్క్ చీరలు, కాంచీపురం చీరలను అందిస్తుంది. కొత్త స్టోర్, వ్యూహాత్మకంగా ఒక ప్రధాన ప్రాంతంలో ఉంది, ఇది మా క్లస్టర్ ఆధారిత విధానంలో భాగమైందని ఆయన వివరించారు.
'మా వరమహాలక్ష్మి స్టోర్‌లు ప్రత్యేకమైన అనుభవాన్ని, కస్టమర్ సేవను అందిస్తాయని మేము నమ్ముతున్నాం. ఇది మా ఇన్వెంటరీ, మేము అందించే వివిధ రకాల ఎస్.కె.యులతో కలిపి, పెరుగుతున్న కస్టమర్ బేస్‌ను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఇక్కడ నుండి, మేము దక్షిణ భారతదేశం అంతటా 25 అదనపు స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నాం. వీటిని వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో నెలకొల్పేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు చెప్పారు.
వరమహాలక్ష్మి రిటైల్ బ్రాండ్ ఫార్మాట్ 2011లో చిక్‌పేట్, బెంగుళూరులో మొదటి స్టోర్ ప్రారంభంతో స్థాపించబడింది. మే 31, 2022 నాటికి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, నెల్లూరు మొదలైన నగరాల్లో మరింత విస్తరించబడింది. వరమహాలక్ష్మి దుకాణాలు సంప్రదాయబద్ధంగా అలంకరించివుంటాయి.
కాంచీపురం సంస్కృతిలో బ్రాండ్ మూలాలను ప్రతిబింభిస్తాయి. ఇది చేనేత చీరల వ్యాపారాన్ని తిరిగి ఆవిష్కరించే బ్రాండ్‌గా భావించబడింది. కాంచీపురం పట్టు చీరలు, ఇతర చేనేత, సందర్భానుసారంగా ధరించే చీరలను ఒకే గొడుగు కింద అందిస్తుందని ఆయన వివరించారు.