1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (10:56 IST)

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ తనయుడు?

Mahesh Babu
Mahesh Babu
సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వారసుల సంప్రదాయం ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోలు, హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు.
 
దివంగత నటుడు కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేష్ బాబు. తెలుగులో అగ్ర నటుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన తనయుడు గౌతమ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 
"1 నేనొక్కడినే" సినిమాలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. దాంతో మహేష్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
 
హైదరాబాద్‌లో జరిగిన PMJ జ్యువెలర్స్ లుక్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మహేష్ బాబు భార్య నమ్రత, సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ...ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువుపైనే ఉంది. మరో ఆరేళ్ల తర్వాత గౌతమ్ సినిమాల్లోకి వస్తాడని తల్లి నమ్రత తెలిపారు. 
 
గౌతమ్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు, అతను సినిమాల్లో నటించడానికి చాలా చిన్నవాడు. అయితే గౌతమ్‌కి నటనపై ఆసక్తి ఉంది. మరోవైపు, మహేష్, నమ్రత కుమార్తె సితార కూడా నటనపై ఆసక్తి చూపింది. 
 
తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పింది. ఇప్పటికే ఓ వాణిజ్య ప్రకటనలో నటించింది. అందుకు గాను ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ చారిటీకి ఖర్చు చేసిందని వెల్లడించింది.