గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 జులై 2023 (15:45 IST)

యాక్టింగ్‌ అంటే ఇష్టమని తేల్చి చెప్పిన సితార ఘట్టమనేని

Sitara Ghattamani
Sitara Ghattamani
మహేష్‌ బాబు కుటుంబంలో ఆయన కొడుకు గౌతమ్‌ నటుడిగా ఇంకా చాలా టైం పడుతుందని ఇప్పుడు చదువుపైనే శ్రద్ధ చూపిస్తున్నాడని నమత్ర శిరోద్కర్‌ స్పష్టం చేశారు. అయితే కుమార్తె సితార విషయం అందుకు విరుద్దం. తనకు చిన్నప్పటినుంచి కెమెరాముందు యాక్ట్‌ చేయడమంటే చాలా ఇష్టం. అందుకే పిఎం.జె. జ్యూయలరీస్‌ యాడ్‌ను చేసిందని తెలిపారు. దీనిపై సితార మాట్లాడుతూ, కెమెరాముందు నటించేటప్పుడు చాలా కాజువల్‌గానే చేసేశాను. టెన్షన్‌ పడలేదు. ఎందుకంటే నాన్నగారితో మాట్లాడేటప్పుడు కెమెరా ఫేస్‌ ఎలాచేయాలో చెబుతుండేవారు అని తెలిపారు.
 
నాన్న, నేను గుడ్‌ ఫ్రెండ్స్‌లా వుంటాము. తనతోనే ఎక్కువగా సినిమా విషయాలు షేర్‌ చేసుకుంటానని సితార తెలిపింది. తనకు యాక్టింగ్‌ అంటే ఇష్టమనీ, ఇంతకుముందు ఎటువంటి యాడ్‌ ప్రకనలు రాలేదని, తొలిసారిగా పి.ఎం.జె. వచ్చిందని అన్నారు. స్కూల్‌ డేస్‌లోనే తన స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి పలురకాలు టిప్స్‌ను పోస్ట్‌ చేసేది సితార. ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ కూడా ఎక్కువగానే వున్నారు.