పాదయాత్రకు సిద్ధమవుతున్న అగ్ర హీరో ఎవరు?
తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో విజయ్ ఒకరు. ఈయన అభిమానులు విజయ్ మక్కల్ ఇయ్యక్కం పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలన నిర్వహిస్తారు. ఇటీవల అనేక మంది విద్యార్థులకు కూడా వివిధ రకాలైన సాయం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి విజయ్ మక్కల్ ఇయ్యక్కం నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
తాజాగా నిర్వహించిన సమావేశంలోనే పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన తాజా చిత్రం లియో విడుదల కంటే ముందుగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.