సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (19:43 IST)

విజయ్ 'లియో' నుంచి ఫస్ట్ మాస్ సింగిల్ సాంగ్ రిలీజ్

vijay
ఇళయదళపతి విజయం గురువారం తన 49వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "లియో" నుంచి ఫస్ట్ సింగిల్‌గా మాస్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ కాగా, అర్జున్, సంజయ్ దత్, మిష్కిన్, గౌతం వాసుదేవ్ మీనన్ వంటివారు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. "నా రెఢీ" అంటూ సాగే ఈ మాస్ సాంగ్ విజయ్ ఫ్యాన్స్‌ను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. విజయ్ - లోకేశ్ కనకరాజ్ - అనిరుధ్ రవిచంద్రన్ కలయికతో వచ్చిన మాస్టర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.