సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (11:20 IST)

దళపతి విజయ్ లియో ఫస్ట్ లుక్ - సక్సెస్ కావాలని కోరుకున్న లారెన్స్

Leo First Look
Leo First Look
తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన నటిస్తున్న లియో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఈ సినిమా చేస్తున్నాడు. తోడేలు లా అవసరమైతే చేల్చి చెండాతుతా అనేలా.. విజయ్ లుక్ ఉంది. చేతిలో రక్తంతో కూడిన సుత్తి ఉంది. అంతేకాక,  పేరులేని నదుల ప్రపంచంలో, ప్రశాంతమైన జలాలు దైవిక దేవతలుగా లేదా భయంకరమైన రాక్షసులుగా మారతాయి. అంటూ కాప్షన్ పెట్టారు. ఇది యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. 
 
Vijay, Raghava Lawrence
Vijay, Raghava Lawrence
కాగా, విజయ్ కు రాఘవ లారెన్స్ గ్రీటింగ్స్ చెపుతూ, హ్యాపీ బర్త్డే నంబా! నీ సినిమా హిట్ కావాలని, నీ హెల్త్ బాగుండాలని రాఘవేంద్ర స్వామిని వేడుకుంటున్నాను.. అని ట్వీట్ చేసాడు. అలాగే  తెలుగు సినిమా నుంచి అనేకమంది దర్శకులు కూడా విజయ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియోస్  నిర్మాణం చేస్తుంది.