1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (13:05 IST)

రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలనేది నా కోరిక : రాఘవ లారెన్స్

Raghava Lawrence
Raghava Lawrence
కాంచన చేసినప్పుడే శరత్ కుమార్ గారు నాకు లక్కీ. ఇందులో విలన్ పాత్ర గురించి విన్నపుడు శరత్ కుమార్ గారు ఉంటేనే బావుంటుందని అనుకున్నాను. ఈ పాత్రకు పవర్ ఫుల్ పర్సన్ కావాలి అలాగే యాక్షన్ కూడా చేయాలి. ఈ రెండూ శరత్ కుమార్ గారు అద్భుతంగా చేస్తారు. నా పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో.. శరత్ కుమార్ గారి పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా వుంటుంది` అని రాఘవ లారెన్స్ అన్నారు. 
 
కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం రుద్రుడు. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
రుద్రుడు కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
మీ అందరికీ తెలుసు నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. రుద్రుడు మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. అలాగే నేను ప్రతీ సినిమాలో ఏదో ఒక మంచి సందేశం చెబుతాను. రుద్రుడులో అమ్మా నాన్నల గురించి ఓ మంచి సందేశం వుంది. అలాగే నాకు కావాల్సిన యాక్షన్, కామెడీ, ఫన్, రోమాన్స్ అన్నీ కుదిరాయి. మాస్.. క్లాస్.. ఫ్యామిలీస్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ బేస్డ్ సినిమా రుద్రుడు. అమ్మని ఇష్టపడే వాళ్ళంతా రుద్రుడ్ని ఇష్టపడతారు. 
 
రుద్రుడు లో ఇప్పటివరకూ చేసిన పాత్రలకి దీనికి ఎలాంటి వైవిధ్యం వుంది?
ఇందులో ఒక కామన్ మ్యాన్ గా కనిపిస్తా. జీవితంలో ఒక సమస్య తలెత్తుతుంది. ఇది సహజంగా జరుగుతుందని భావిస్తున్న సమయంలో... కాదు ఎవరో కావాలని చేస్తున్నారని తెలుస్తుంది. అలాంటి సందర్భంలో ఆ సామన్యుడు ఎదురు తిరిగితే ఎలా వుంటుందనేది నా పాత్ర. సామాన్యంగా నేను చేసే పాత్రల్లో మాస్ వుంటుంది. ఇందులో మాత్రం ఐటీ ఉద్యోగం చేసే ఒక కామన్ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపిస్తా. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్ గా మార్చాయి? అనేది ఇందులో చాలా ఆసక్తికరంగా వుంటుంది.
 
ముని, కాంచన చిత్రాలు ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇచ్చాయి.. రుద్రుడు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
కాంచనలో వున్న థ్రిల్ రుద్రుడులో కూడా వుంటుంది. అయితే అది వేరే విధంగా వుంటుంది. కాంచనలో వున్న ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎపిసోడ్స్ రుద్రుడులో వుంటాయి. అలాగే యాక్షన్ కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. మాస్ అంటే ఎమోషన్. ఎమోషన్ ఉంటేనే మాస్ వస్తుంది. రుద్రుడులో ఎమోషన్ ని బాగా నమ్ముతున్నాను. ఇది వందశాతం రీచ్ అవుతుంది.
 
కొత్త దర్శకుడు కతిరేసన్ గారితో పని చేయడం ఎలా అనిపించిది ?
కతిరేసన్ గారు నిర్మాత కూడా. ఒక కథ తీసుకొచ్చి దర్శకత్వం చేస్తానని చెప్పారు. నాకు కథ చాలా నచ్చింది. నన్ను కొత్తగా చూపించాలనే తపన నాకు బాగా నచ్చింది. నేను మాస్, డాన్ సినిమాలు చేసినప్పుడు ఒక కేటగిరీ. కాంచన టచ్ చేసిన తర్వాతే అదే నాలుగు పార్టులుగా వచ్చింది. దాని నుంచి బయటికి రావాలంటే మంచి కంటెంట్ కావాలి. అలాంటి మంచి కంటెంట్ తీసుకొచ్చారు. ఇద్దరం అనుభవాలని పంచుకొని సినిమాని చాలా ఫ్రండ్లీ గా చేశాం.
 
రుద్రుడు లో యాక్షన్ ఎంత పవర్ ఫుల్ గా వుండబోతుంది ?
అఖండ ఫైట్స్ నాకు చాలా నచ్చాయి.  బాలయ్య బాబు గారు అద్భుతంగా యాక్షన్ చేశారు. యాక్షన్ కోసమే సినిమా మూడు సార్లు చూశాను. ఆ ఫైట్ మాస్టర్ కావాలని చెప్పాను. శివ మాస్టర్ ఈ కథకు తగ్గట్టు యాక్షన్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్ వుంటుంది.
 
ఇటు సినిమాలు అటు సేవా కార్యక్రమాలని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ?
సినిమాలతో ఎంత బిజీగా వునప్పటికీ ఒకరు మన తలుపు కొడుతున్నారంటే ఖచ్చితంగా మన అవసరం వుంటుంది. దీనిని బ్యాలెన్స్ చేసుకోవడం మొదట్లో కష్టంగా వుండేది. తర్వాత అలవాటైపోయింది. షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా పిల్లలు హాస్పిటల్ లోకి వెళ్లి ఆపరేషన్ సక్సెస్ అయి తిరిగివచ్చేవరకూ నేను టెన్షన్ లోనే వుంటాను. పిల్లలకి దాదాపు 150 ఆపరేషన్ల వరకూ చేయించివుంటాను. ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా హాయిగా వున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పిల్లల తల్లితండ్రుల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు చాలా సంతోషంగా వుంటుంది.  సినిమాల్లో హీరోగా వుండటం కంటే రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలనేది నా కోరిక. అది దేవుడు నాకు ఇచ్చిన వరం.
 
కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?
చంద్రముఖి 2,  జిగర్తండా 2 చేస్తున్నాను. అలాగే లోకేష్ కనకరాజ్ కథ స్క్రీన్ ప్లే తో ఆయన కో డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ నిర్మాత.