ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:58 IST)

నా జేబులో డబ్బులుతో సాయం చేయడంలేదు : రాఘవ లారెన్స్‌

Raghava Lawrence
Raghava Lawrence
రాఘవ లారెన్స్‌ మొదట గ్రూప్‌ డాన్సర్‌. చిరంజీవి ప్రోత్సాహంతో డాన్స్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ఆ తర్వాత తన గురువు ప్రభుదేవా సినిమాకే డాన్స్‌ మాస్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు నటుడు, దర్శకుడు, నిర్మాతగానూ మారాడు. మరోవైపు ప్రజాసేవ చేస్తున్నాడు. తన మాతృమూర్తి చెప్పినట్లు చనిపోయినా హీరోగా వుండాలంటే అనాథలకు, వికలాంగులకు పేదలకు సేవచేయాలనే కంకణంకట్టుకున్నాడు. తాజాగా ఆయన సినిమా రుద్రుడు ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
అభిమానులు హైదరాబాద్‌లోనూ సందడిగా పాల్గొన్నారు. వారి ఉత్సాహాన్ని చూసిన ఆయన మీలో ఎవరికైనా హెల్ప్‌ కావాలంటే చేస్తాను. నా ట్రస్ట్‌ను సంప్రదించండి. ఇది మీరు నాకిచ్చిన డబ్బే. పైసా నేను జేబులోంచి తీయడంలేదు. మీరుకొన్న ప్రతి టికెట్‌ ద్వారా నాకు వచ్చిన ఈ హోదా వల్ల మంచి పనులు చేస్తున్నా. డబ్బుల్లేక చదువులోని పిల్లలు, అనారోగ్య సమస్యలు, వికలాంగులు ఎవరైనా సరైన అవసరం అనుకుంటే నేను ముందుంటా. మీరు సద్వినియోగం చేసుకోండి అంటూ తెలిపారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా అంటే దాదాపు 3నిముషాలుపాటు లారెన్స్‌కు జేజేలు పలికారు. హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లోఈ ఈవెంట్‌ జరిగింది.