1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:49 IST)

ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్ : గోపిచంద్ మలినేని

Kiran Abbavaram, Gopichand Malineni, Ramesh Kaduri, Naveen Yerneni
Kiran Abbavaram, Gopichand Malineni, Ramesh Kaduri, Naveen Yerneni
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్న నేపధ్యంలో మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.
 
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. . సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజల్స్ కొట్టి గోల చేసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. సమ్మర్ కి మీరు ఆ ఎనర్జీ ఫీలౌతారు. థియేటర్ లో కూర్చున్నప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎకువ ఎక్సయిట్ అవుతారు. నన్ను చాలా కొత్తగా చూస్తారు. సమ్మర్ లో అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. మంచి హాలీడే సీజన్. రవితేజ గారి సినిమా, మీటర్ రెండూ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసి వీకెండ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీటర్ కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను. మాస్ మీటర్ ఇది. మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మీటర్ మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు
 
గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. క్రాక్ సినిమాకి రమేష్ నా దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. ప్రతి దర్శకుడికి మంచి బ్యానర్ నుంచి రావాలని కల వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, నవీన్ గారు రవి గారు చెర్రీ గారు వెనక వుండటం రమేష్ అదృష్టం. ట్రైలర్ టీజర్ మాస్ మీటర్ లో వున్నాయి. ఈ సినిమా రమేష్ కి మంచి డెబ్యు అవ్వాలని కోరుకుంటున్నాను. కిరణ్ కి యూనిక్ స్టయిల్ వుంది. రవితేజ, నాని తర్వాత ఎలాంటి నేపధ్యం లేకుండా వచ్చిన హీరో తను. కిరణ్ ప్రధాన బలం డైలాగ్ డెలివరీ. అది చాలా నేచురల్ గా వుంటుంది. ఈ సినిమాతో తనకి మాస్ హిట్ రావాలని కోరుకుంటున్నాను. అత్యుల రవి మాస్ సినిమాకి సరిపడే హీరోయిన్. అందంగా వుంది. చక్కగా తెలుగు మాట్లాడుతోంది. సాయి కార్తిక్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనకి మంచి మాస్ పల్స్ వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 7 మీటర్ వస్తోంది. ఈ సమ్మర్ కి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్’’ అన్నారు
 
నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. నిన్ననే ఈ సినిమా చూశాను. చాలా బావుంది. మీటర్ ఈ సమ్మర్ లో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్. కిరణ్ ప్రతి సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. టీం అందరికీ గుడ్ లక్. అందరూ ఏప్రిల్  7న థియేటర్ లో మీటర్ సినిమా చూడాలి’’ అని కోరారు.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. కిరణ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు. పాత్ర చాలా డైనమిక్ గా స్టయిలీష్ గా వుంటుంది. అతుల్య రవి, సప్తగిరి అందరూ చక్కగా చేశారు. ఏప్రిల్ 7 న అందరూ థియేటర్ లో మీటర్ చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు   
 
అతుల్య రవి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పెద్ద బ్యానర్స్ లో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. వారికి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. ఇంత పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. మీటర్ లో కిరణ్ మాస్ అవాతర్ చూస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న అందరూ థియేటర్ లో మీటర్ ఎంజాయ్ చేయండి’’ తెలిపారు
 
దర్శకుడు రమేష్ కడూరి మాట్లాడుతూ:   ‘మీటర్’ అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఇందులో వుంది. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఒక కుటుంబం భాద్యత తీసుకునే వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఇందులో హీరో కిరణ్ పాత్ర కూడా అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సమ్మర్ హీట్ ఎంత వుంటుందో మీటర్ కలెక్షన్స్ కూడా అంతే ఎక్కువ వుంటాయి. దిలీప్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు, జెవి గారు మంచి సెట్స్ వేశారు. రైటర్ సూర్య మంచి డైలాగులు ఇచ్చాడు. కిరణ్ చాలా సింపుల్ గా వుండే వ్యక్తి. ఇందులో ఎప్పుడూ చూడని కిరణ్ ని చూస్తారు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఎనర్జీ, ఎమోషన్స్ అందరినీ మెప్పిస్తాయి.అతుల్య రవి చాలా మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీటర్ సినిమాని  సమ్మర్ కి కానుకగా ఇస్తున్నాం.ఫుల్ మీల్స్ లా వుంటుంది. మీరు పెట్టిన టికెట్ కి డబుల్ ట్రిపుల్ వస్తుందని గ్యారెంటీ ఇస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అన్నారు.