1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bhaga Bhaga Ragalara song from Raghava Lawrence Rudrudu released

రాఘవ లారెన్స్ రుద్రుడు నుండి భగ భగ రగలరా పాట విడుదల

Raghava Lawrence
Raghava Lawrence
యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదలకు రెడీ అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ రోజు రుద్రుడు నుంచి భగ భగ రగలరా పాటని విడుదల చేశారు.
 
జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని రుద్రుడు టైటిల్, పాత్రకు జస్టిఫికేషన్ గా చాలా పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  రుద్రుడిగా లారెన్స్ ప్రజన్స్ పూనకాలు తెప్పించగా.. పృధ్వీ చంద్ర ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు.
 
లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది.
ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ.
 రుద్రుడు ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
About Writer
డీవీ
తర్వాతి కథనం
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన మేలో విడుదల