బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (16:41 IST)

కంగనా రనౌత్ కు ధన్యవాదాలు తెలిపిన లారెన్స్

Kangana Ranaut, Raghava Lawrence
Kangana Ranaut, Raghava Lawrence
నటుడు, డాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ధన్యవాదాలు అమ్మా! అంటూ కంగనా రనౌత్ కు తెలిపారు. వీరి కాంబినేషన్లో చంద్ర ముఖీ 2 చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఆరంభంలో రజనీ కాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరిగింది. అక్కడ అనుకున్న పార్టీ  షూటింగ్ పూర్తి అయిన తర్వాత లారెన్స్ ఇలా స్పందించారు.  మీ మంచి మాటలకు ధన్యవాదాలు అమ్మా! ఎలాంటి నేపథ్యం లేకుండా మీ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. 20 రోజుల బాంబే షెడ్యూల్‌లో, నేను నా ఇంటి ఆహారాన్ని చాలా కోల్పోయాను అనుకున్న సమయంలో ప్రతిరోజూ రుచికరమైన ఆహారాన్ని ఏర్పాటు చేయడం చాలా బాగుంది.  నేను కూడా మీతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది! ప్రతిదానికీ ధన్యవాదాలు అని తెలిపారు. 
 
అందుకు కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ,  ఈరోజు చంద్రముఖిలో నా పాత్రను పూర్తి చేయబోతున్నందున, నేను కలిసిన చాలా మంది అద్భుతమైన వ్యక్తులకు బై చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంది, లారెన్స్ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన రాఘవ లారెన్స్ సార్, వాస్తవానికి నేను చాలా మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాను. మీరు కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి డైరెక్టర్ గా ఎదిగిన తీరు అందరికి స్ఫూర్తి అని తెలిపారు.