1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Yuvagalam Padayatra reached 150 Days

150 రోజులకు చేరిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

nara lokesh
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 150 రోజులకు చేరింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం  అల్లూరుకు చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 
 
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నారాలోకేష్ పాల్గొన్నారు. అల్లూరులో లోకేశ్‌ను చూసేందుకు భారీగా ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని.. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తామని.. దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కస్టమర్లకు షాక్.. రుణ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్