నేటి నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభంకానుంది. రాజమండ్రిలో జరిగిన టీడీపీ మహానాడు కారణంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు పాదయాత్రను వాయిదా వేశారు. ఇపుడు నాలుగు రోజుల విరామం తర్వాత ఆయన మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభించారు.
కాగా, ఆయన తన పాదయాత్రను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చేశారు. మే 30వ తేదీ మంగళవారం నుంచి జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆయన పాదయాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి.
ఇప్పటివరకు మొత్తం 111 రోజుల పాటు పాదయాత్ర జరుగగా నారా లోకేశ్ నడిచిన మొత్తం దూరం 1423.7 కిలోమీటర్లని తెలిపింది. మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి మొదలై 4.20 గంటలకు పెద్ద పులుసు మోటు వద్ద స్థానికులతో మాటామంతీ.
సాయంత్రం 4.30 గంటలకు సంజాముల మోటు వద్ద బహిరంగ సభ. యువనేత ప్రసంగం. 5.45 గంటలకు జమ్మలమడుగు పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ. 6.15 గంటలకు కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం. 8.15 గంటలకు ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ. 9 గంటలకు శేషారెడ్డి పల్లె పాలకోవా సెంటరులో స్థానికులతో మాటామంతీ. 9.30 గంటలకు దేవగుడి సుంకులాం దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస.