యవ్వనంగా వుండాలంటే.. కోడిగుడ్డు-కాఫీ పొడి చాలు
యవ్వనంగా వుండాలంటే.. కోడిగుడ్డు-కాఫీ పొడి చాలు. వీటికి కాస్త టమోటా రసం కలిపితే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
కావలసినవి: గుడ్డు-1 (తెలుపు మాత్రమే) కాఫీ పొడి - 1 టీస్పూన్, టొమాటో రసం - 2 టీస్పూన్లు
తయారీ విధానం: గుడ్డులోని తెల్లసొనను నురుగు వచ్చేవరకు కొట్టి బాగా కలపాలి. టమాటా రసం, కాఫీ పొడి వేసి అందులో కలపాలి. ఆపై ఫేషియల్ కోసం సిద్ధం చేసుకోవాలి. ముఖం తుడుచుకోవడానికి ఉపయోగించే టవల్‌ను వేడి నీళ్లలో ముంచి బాగా పిండాలి. ఆ టవల్‌తో ముఖాన్ని తుడవాలి.
తర్వాత కోడిగుడ్డు, కాఫీపొడి పేస్ట్‌ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత బాగా ఆరబెట్టాలి. ఇది ఫేస్ మాస్కులా వుంటుంది. దీన్ని సున్నితంగా తీసి, సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.
ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే చర్మంపై ఉండే మురికి, కాలుష్య కారకాలు సులభంగా తొలగిపోతాయి. ఇంకా వృద్ధాప్య లక్షణాలు తొలగిపోతాయి.
ఈ ఫేస్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. చర్మం ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసొన చర్మంపై వచ్చే ముడతలను సరిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలలోకి లోతుగా చొచ్చుకుపోయి మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.