గుడ్లగూబ ఆ ప్రాంతాల్లో కనిపిస్తే... ఏం జరుగుతుందో తెలుసా?
రాత్రివేళల్లో కనిపించే గుడ్లగూబను చూసి చాలా మంది భయపడుతుంటారు. గుడ్లగూబ కళ్లు తీక్షణమైన దాని చూపులు అది చేసే చిత్రమైన ధ్వని ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంటుంది. మెుదటి నుండి కూడా కీడు కలిగించే పక్షిగా గుడ
రాత్రివేళల్లో కనిపించే గుడ్లగూబను చూసి చాలా మంది భయపడుతుంటారు. గుడ్లగూబ కళ్లు తీక్షణమైన దాని చూపులు అది చేసే చిత్రమైన ధ్వని ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంటుంది. మెుదటి నుండి కూడా కీడు కలిగించే పక్షిగా గుడ్లగూబకి పేరు ఉంది. అందువలనే దానివైపు చూడడానికి కూడా ఎవ్వరు ఇష్టపడరు. అంతేకాకుండా అది కనిపిస్తే, దాని అరుపు వినిపిస్తే చెడుకి సంకేతంగా భావిస్తుంటారు.
అసలు నిజం చెప్పాలంటే గుడ్లగూబ వలన కొన్ని అపశకునాలు మాత్రమే కాదు, శుభాలు కూడా జరుగుతాయని చెప్పబడుతోంది. సాక్షాత్తు లక్ష్మీదేవి కొన్ని సందర్భాలలో గుడ్లగూబను వాహనంగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా పల్లే ప్రాంతాల్లో గుడ్లగూబలు ఎక్కువగా ఉంటాయి.
పశువుల కొట్టంపై గుడ్లగూబ వాలినా, ఒకవేళ అక్కడ గూడుని ఏర్పాటు చేసుకున్నా పాడి అభివృద్ధి చెందుతుందని గ్రంధాలలో చెబుతున్నారు. ధాన్యాలను నిల్వచేసుకునే ప్రదేశంలో గుడ్లగూజ ఉన్నా, అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా ఆ ఇంట్లో ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పురాణాలలో చెప్పబడుతోంది.

