గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:08 IST)

ఇలా కలలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

జీవితమంటే కల కాదని అంటూ ఉంటారు. కల అనేది వాస్తవం కన్నా ఎంతో అందంగా ఉంటుంది. అయితే అందంగా ఉన్న ఈ కలలు మంచి అనుభూతిని కలిగించే కలలే కావు. ఒక్కోసారి కంగారు పుట్టించే కలలు కూడా వస్తుంటాయి. ఇక అందమైన కలలు

జీవితమంటే కల కాదని అంటూ ఉంటారు. కల అనేది వాస్తవం కన్నా ఎంతో అందంగా ఉంటుంది. అయితే అందంగా ఉన్న ఈ కలలు మంచి అనుభూతిని కలిగించే కలలే కావు. ఒక్కోసారి కంగారు పుట్టించే కలలు కూడా వస్తుంటాయి. ఇక అందమైన కలలు వచ్చినప్పుడు అప్పుడే తెల్లవారిపోతుందనిస్తుంది. ఒకవేళ పీడ కలలు వస్తే మాత్రం ఎప్పుడు తెల్లవారుతుందనిపిస్తుంది.
  
 
సాధారణంగా మనం చూసిన సంఘటనలే మనకు కలలుగా వస్తుంటాయి. ఇలాంటి కలల గురించి అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. కానీ ఎలాంటి సంబంధం లేకుండా వచ్చే కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరుగనున్న కొన్ని పరిణామాలను సూచిస్తున్నట్లుగా వస్తాయి. చీకటిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి ఏ గోతిలోనో, నీటిలోనో పడినట్లుగా కొందరి కలలు వస్తుంటాయి. 
 
మరికొందరికి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నదిలో పడిపోయినట్లుగా కూడా కలలు రావడం జరుగుతుంటాయి. ఈ విధమైన కలలు భవిష్యత్తులో జరుగనున్న ప్రమాదానలను సూచిస్తుంటాయి. ఇలా కలలు వస్తే జరుగబోయే కీడును ముందుగానే మీకు తెలియజేయునట్లుగా వస్తుంటాయని శాస్త్రంలో చెప్పబడుతోంది.