గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 26 జులై 2018 (13:51 IST)

ప్రతిరోజూ పాలలో పసుపు కలిపి తీసుకుంటే?

పసుపును ప్రతిరోజూ వంటకాల్లో వాడుతుంటాం. సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తుంది. నిత్యం రాత్రి నిద్రించడానికి ముందుగా గ్లాస్ పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకుంటే మంచిది. పసుపులో దాగిఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

పసుపు శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో చాలా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపును తీసుకోవడం వలన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా వ్యాధికి మంచిగా దోహదపడుతుంది. 
 
నిద్రలేమి సమస్యతో బాధపడేవారిని పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపునొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి వ్యాధులు దరిచేరవు. పేగులలోని క్రిములను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తుంది.