శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (13:40 IST)

షిరిడీ సాయిబాబా మహిమాన్వితం...

షిరిడీలో గల సాయిబాబా మహిమలు గురించి అక్కడి చుట్టుప్రక్కల గ్రామాలలో చెప్పుకుంటుంటారు. ఈ మాటలను బాబా వింటుంటారు. చాలాకాలం క్రితం హఠాత్తుగా చూపు కోల్పోయిన ఒక వ్యక్తి నానా అవస్థలతో బాధపడుతున్నాడు. చూపు రా

షిరిడీలో గల సాయిబాబా మహిమలు గురించి అక్కడి చుట్టుప్రక్కల గ్రామాలలో చెప్పుకుంటుంటారు. ఈ మాటలను బాబా వింటుంటారు. చాలాకాలం క్రితం హఠాత్తుగా చూపు కోల్పోయిన ఒక వ్యక్తి నానా అవస్థలతో బాధపడుతున్నాడు. చూపు రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ అవి ఏవి ఫలించలేదు. ఇన తనకి చూపు రాదని నిర్ధారణ చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
 
భక్తులు మాటలను వింటున్న ఆ వ్యక్తి బాబాను చూడాలనిమించింది. ఆయనను చూపురాకపోయిన పర్వాలేదు బాబా సన్నిధిలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి బాబాను చూసేందుకు షిరిడీ వెళ్లే వారితో కలిసి బయలుదేరాడు. అలా షిరిడీ వరకూ నడచి వెళ్లిన ఆ వ్యక్తికి ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే చూపువచ్చేసింది. 
 
అంతే ఆ వ్యక్తి సంతోషంతో పొంగిపోతూ బాబా ఉండే మశీదు వైపుకు పరుగులు తీస్తాడు. బాబా కనిపించగానే ఆయన పాదాలపై పడతాడు. బాబా ఆ వ్యక్తిని పైకి లేవనెత్తి తాను అందంగా కనిపిస్తున్నారని నవ్వుతూ అతనిని అడిగాడు. అంతే ఆ వ్యక్తి ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మెుదలుపెట్టాడు. తనకు చూపు వచ్చిందనే సంతోషం కన్నా ఆ చూపుతో బాబాను చూడగలిగినందుకు ఆనందంగా ఉందని చెబుతున్నాడు.