సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (13:39 IST)

పళ్లాలమ్మ తల్లి ఆవిర్భవించిన కథ....

గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా ప

గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా పిలవబడేదని శాస్త్రంలో చెప్పబడుతోంది. కాలక్రమంలో ఆ పేరు కాస్త వానపల్లిగా మారిపోయిందని అంటుంటారు.
 
సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ సీతమ్మ తల్లి వలనే పళ్లాలమ్మ తల్లి ఇక్కడకి ఆవిర్భవించిందని పురాణంలో చెప్పబడింది. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో, పండ్లతో ప్రత్యక్షమైయ్యారు. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై పువ్వులను, పండ్లను అందించిన అమ్మవారే పళ్లాలమ్మగా ఇక్కడ అవిర్భవించారు.
 
అప్పటి నుండి అమ్మవారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నారు. భక్తులు ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ పాంత్రంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్టమైన దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.